కొండాపూర్లో ఘనంగా కొమురం భీమ్ జయంతి వేడుకలు
బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం కొండాపూర్ గ్రామంలోని కొమురం భీమ్ చౌరస్తా వద్ద కొమురం భీమ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తాటిగూడ సర్పంచ్ మడావి వెంకటేష్ మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం కొమురం భీమ్ చేసిన పోరాటం యావత్ ఆదివాసీ సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, జాతి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ సమాజ సర్వతోముఖాభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు.
కార్యక్రమంలో గ్రామ పటేల్ మడావి గంగారం, ఆదివాసీ సేన ప్రధాన కార్యదర్శి పెంద్రం శంకర్, ఉపాధ్యక్షుడు కొడప అనంతరావు, పివిటి జి ఉపాధ్యక్షుడు వల్క చిలుకయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైదం రమేష్తో పాటు ఆదివాసీ నాయకులు మడావి పార్వతీరావు, కుడ్మెత వసంతరావు, సిడం సోము, తోడసం లక్ష్మణ్, కుర్సెంగ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


