అభివృద్ధి పనుల శంకుస్థాపనలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
సంస్థాన్ నారాయణపురం యాదాద్రి భువనగిరి జిల్లా, మునుగోడు నియోజకవర్గం, నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో 76.20 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్న రోడ్లకు శంకుస్థాపన చేశారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నారాయణపురం మండలం గుడిమల్కాపురం నుండి చల్మెడ (వయా సర్వేల్, లింగం వారి గూడెం, సాయిగోని బావి) వరకు 32.90 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే డబుల్ రోడ్డు అభివృద్ధి పనులకు, నారాయణపురం నుండి సర్వేల్ వరకు (5 కిలోమీటర్లు) 11 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయనున్న రోడ్డు నిర్మాణ పనులకు,, సర్వేల్ నుండి మునుగోడు మండలం పలివెల(వయా మల్లారెడ్డిగూడెం) వరకు 32.30 కోట్ల వ్యయంతో నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు..గ్రామాల నుండి గ్రామాలకు వెళ్లే రోడ్లన్నీ కూడా 3.75 మీటర్ల వెడల్పుతో ఉండేవని రవాణా సౌకర్యాలు మెరుగై ప్రతి గ్రామంలోకి కార్లు బైకులు బస్సులు వస్తున్న నేపథ్యంలో ఆ రోడ్లని 5.5 మీటర్ల వెడల్పు చేయాలనే ఆలోచనను తానే ప్రభుత్వానికి విన్నవించడంతో ప్రజా ప్రభుత్వం వెంటనే స్పందించడంతో మునుగోడు నియోజకవర్గం లో 5.5 మీటర్ల వెడల్పుతో రోడ్లను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు... రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మా సోదరుడు ఆర్ అండ్ బి శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారం వల్లే ఈ రోడ్ల అభివృద్ధి జరుగుతుందన్నారు. రోడ్లను అభివృద్ధి చేసే సందర్భంలో ఆయా గ్రామాల గ్రామస్తుల తో పాటు అన్ని శాఖల అధికారులు ముఖ్యం గా జర్నలిస్టులు మీడియా మిత్రులు సహకరించాలని కోరారు..మంత్రివర్గ విస్తరణ అంశం మంత్రి పదవి ఇచ్చే అంశం అధిష్టానం చేతిలో ఉందని అధిష్టానం ఏది చెబితే అది ఫైనల్ అని మా నాయకుడు రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.. కొండా సురేఖ అంశం కూడా అధిష్టానం చేతిలో ఉందని అధిష్టానం ఏది చెప్తేఅది ఫైనలన్నారు... తాను ఎక్కడ మాట్లాడినా కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పై కష్టపడిన కార్యకర్తలకు అన్యాయం జరుగొద్దనేది నా ఆలోచన అని, కష్టపడ్డ కార్యకర్తలకు ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


