గిరిజనుల అభివృద్ధి కేసీఆర్ హయం లోనే

మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ 

గిరిజనుల అభివృద్ధి కేసీఆర్ హయం లోనే

ఈనెల 17న ప్రతి తండాలో భారత రాష్ట్ర సమితి నిరసన కార్యక్రమాలు......

 కాంగ్రెస్ హయాంలో గిరిజన అభివృద్ధి శూన్యం.....

బాన్సువాడ  : తెలంగాణ రాష్ట్రం లో గిరిజనుల అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ ప్రభుత్వ హయాం లో నే మంగళవారం మాజీ ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి బాన్సువాడ  ఇంచార్జ్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదేశాల మేరకు బాన్సువాడ భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ. గిరిజనుల పట్ల కెసిఆర్ ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన అనడానికి ఆయన చేసిన పనులే నిదర్శనమని బాజిరెడ్డి తెలిపారు తెలంగాణ రాష్ట్రం లో 56 వేల ఎకరాల భూమి అభివృద్ధిలోకి తేవడం జరిగిందని గిరిజనులకు మౌలిక వసతులు కల్పించడం గిరిజన మహిళలకు స్వయం ఉపాధి కల్పించిన ఘనత కేసిఆర్ కి దక్కిందని తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనుల కు పోడు భూముల పట్టాలు ఇస్తానని ఇప్పటికి ₹1000 అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం లో చలనం రాలేదని గుర్తు చేశారు. ప్రతి తండాను గ్రామ పంచాయతీగా చేయడమే కాకుండా గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని అన్నారు. కెసిఆర్ కిట్టు ఎస్టి బందు బీమా విద్యుత్తు 3 లక్షలకు పైగా గిరిజనులకు పింఛన్లు ఇవ్వడం జరిగిందని ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి 350 గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు నిర్మించడం జరిగిందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రజలకు మభ్యపెట్టి ఓట్లు వేసుకొని గిరిజనుల అభివృద్ధి పట్టించుకోవడంలేదని బాజిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ రైతు బీమా రైతు బంధు రైతుల పండించిన వడ్లకు బోనస్ కెసిఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేస్తూ వాటిని రద్దు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఈనెల 17న ప్రతి తండాలో గిరిజనుల అభివృద్ధిని  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని ప్రతి ఒక్క గిరిజన సోదరుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. ఈ కార్యక్రమం లో భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు మోరల్ శ్రీనివాసరావు, అంజిరెడ్డి, జుబేర్, రమేష్ యాదవ్, గుడిసెల నరసింహులు గౌడ్, టేకుల సాయిలు, ఆయా మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 23

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం
హైదరాబాద్ : బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న *“ఇంటింటా ఇందిరమ్మ కుట్టు...
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లో టి. ఆర్.పి పాదయాత్ర
బాలాపూర్ లో స్పీకర్ గడ్డ ప్రసాద్ కు ఘన స్వాగతం
ప్రధాని మోదీ పుట్టినరోజున ప్రతి ఇంట దీపం వెలిగించాలి
సీఎం రేవంత్ రెడ్డి తో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ భేటీ.. 
సెప్టెంబర్‌ 17పై సమరశంఖం!
చాంద టి నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్