అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

బిచ్కుంద, : బిచ్కుందలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హాజరై అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. నియోజకవర్గంలో అర్హులైన పేద కుటుంబాలకు సుమారు 16,564 నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ ఆహార భద్రతా పథకాల ప్రయోజనాలు అందనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గత పదేళ్లలో కొత్త రేషన్ కార్డుల జారీ జరగలేదని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, మున్సిపల్ చైర్మన్ సీమ షెట్కర్, వైస్ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం
హైదరాబాద్ : బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న *“ఇంటింటా ఇందిరమ్మ కుట్టు...
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లో టి. ఆర్.పి పాదయాత్ర
బాలాపూర్ లో స్పీకర్ గడ్డ ప్రసాద్ కు ఘన స్వాగతం
ప్రధాని మోదీ పుట్టినరోజున ప్రతి ఇంట దీపం వెలిగించాలి
సీఎం రేవంత్ రెడ్డి తో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ భేటీ.. 
సెప్టెంబర్‌ 17పై సమరశంఖం!
చాంద టి నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్