స్పెల్లింగ్ బి రాష్ట్రస్థాయి పోటీలో ప్రీతికి 3వ స్థానం

తానూర్ : మండల కేంద్రమైన తానూర్ లోని వాగ్దేవి విద్యానీకేతన్ పాఠశాల విద్యార్థిని ప్రీతి రాష్ట్రస్థాయి స్పెల్లింగ్ బి పోటీల్లో సత్తా చాటింది. ఆదివారం నిజామాబాద్‌లోని డాక్టర్ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన స్టేట్ లెవల్ స్పెల్లింగ్ బి పోటీల్లో 5వ తరగతి చదువుతున్న ప్రీతి అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. కఠినమైన పదాలను అలవోకగా ఉచ్చరిస్తూ స్పెల్లింగ్స్‌లో తనకున్న పట్టును నిరూపించుకున్న ప్రీతిని పలువురు ప్రశంసించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రతినిధులు పి. అరవింద్ రెడ్డి, అవినాష్, ప్రిన్సిపాల్ కిరణ్మయి విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


