చదువుతోనే ఉన్నత భవిష్యత్‌

చదువుతోనే ఉన్నత భవిష్యత్‌

  • ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని
  • ఉన్నతంగా చదువుకోవాలి : ఎంఈఓ ఖాజా అమీరుద్దీన్

నారాయణపేట జిల్లా (మక్తల్ ) మక్తల్ మండలం : మాద్వార్ గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు ఉచిత దుస్తులు, సాక్సులు, బెల్టులను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్‌పర్సన్ అంజమ్మ, ప్రధానోపాధ్యాయులు వెంకట్రాములు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఖాజా అమీరుద్దీన్ పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్‌లు, సాక్సులు, బెల్టులను అందజేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.ఈ సందర్భంగా సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు పాఠశాలకు, మాద్వార్ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి గ్రామం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు వెంకట్రాములు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, బలవర్ధకమైన రాగిజావ, గుడ్లు, యూనిఫామ్‌లు, బూట్లు, సాక్సులు, ‘రైజింగ్ తెలంగాణ’ పేరుతో అందిస్తున్న బెల్టులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుకొని పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావడంతో పాటు తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని కోరారు.అనంతరం ఎంఈఓ పాఠశాలలోని తరగతి గదులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాల ప్రాంగణం, రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ప్రహరీ చుట్టూ పేరుకుపోయిన చెత్తాచెదారం, ముళ్లకంచెను తొలగించాలని స్కావెంజర్ సిబ్బందికి సూచించారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి రాజేష్     అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అల్లాదుర్గంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అల్లాదుర్గంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
అందోల్  :తెలంగాణ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికే పెద్దపీట వేస్తోందని వట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్   కొప్పుల లక్ష్మిశేషారెడ్డి అన్నారు.మెదక్ జిల్లా అల్లాదుర్గం...
యరుగండ్లపల్లిలో రికార్డు ధర పలికిన గణేశుడి లడ్డు
గణేష్ ఉత్సవాలకు ఈఎల్వీ ఫౌండేషన్ ఉదారత
సౌర విద్యుత్ ను సద్వినియోగం చేసుకోవాలి :ఎమ్మెల్యే కడియం శ్రీహరి
పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అవసరం: సర్పంచ్
తిరుమలలో మఖ్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిల నృత్య ప్రదర్శన
చదువుతోనే ఉన్నత భవిష్యత్‌