అల్లాదుర్గంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

అల్లాదుర్గంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

అందోల్  :తెలంగాణ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికే పెద్దపీట వేస్తోందని వట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్   కొప్పుల లక్ష్మిశేషారెడ్డి అన్నారు.మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను బుధవారం ఘనంగా పంపిణీ చేశారు.రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ఈకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్ పర్సన్ లక్ష్మి శేషారెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల శేషారెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు లేక నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ప్రజా ప్రభుత్వం వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నామని అన్నారు.ఈ కార్డుల ద్వారా ఆహార భద్రతతో పాటు అన్ని సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందుతాయని తెలిపారు. ఈకార్యక్రమంలో తహసిల్దార్ మల్లయ్య, సర్పంచులు  శశిధర్ రెడ్డి, కవిత విఠల్, శ్రీనివాస్ రెడ్డి, హరికృష్ణ, గోపాల్ రెడ్డి, శంకర్ నాయక్, మన్య నాయక్, వీరన్న పాటిల్,రమ్య భూమి రెడ్డి, నాయకులు శ్రీశైలం, జైపాల్, తదితరులు పాల్గొన్నారు.

Views: 18

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అపర్ణ మాల్ లోని గణేష్ నిమర్జనం  అపర్ణ మాల్ లోని గణేష్ నిమర్జనం 
నిజామాబాద్  : నిజామాబాద్  నగరంలోని స్థానిక పద్మా నగర్ లో గల అపర్ణమాల్ లో ప్రతిష్టించిన గణపతిని భజన చేసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపోయేలాగా అపర్ణ మాల్ కుటుంబ...
పలు కుటుంబాలను పరామర్శించి భరోసా కల్పించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
అల్లాదుర్గంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
యరుగండ్లపల్లిలో రికార్డు ధర పలికిన గణేశుడి లడ్డు
గణేష్ ఉత్సవాలకు ఈఎల్వీ ఫౌండేషన్ ఉదారత
సౌర విద్యుత్ ను సద్వినియోగం చేసుకోవాలి :ఎమ్మెల్యే కడియం శ్రీహరి
పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అవసరం: సర్పంచ్