రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద అన్నదానం
ముఖ్య అతిథులుగా డిసిసి ఉపాధ్యక్షులు దమ్మని శ్రవణ్ కుమార్ ,
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సెప్టెంబర్ 23 (విజన్ ఆంధ్ర బ్యూరో): కుత్బుల్లాపూర్ నియోజక వర్గం లోని డివిజన్ 286 లో రాఘవేంద్ర ,కాలనీ సంక్షేమ సంఘ భవనంలో ని గణేష్ మండపం వద్ద మల్కాజిగిరి డిసిసి ఉపాధ్యక్షులు దమ్మని శ్రవణ్ కుమార్, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించుకున్నానని ఆయన తెలిపారు. అలాగే వర్షాలు పుష్కలంగా కురిసి రైతన్న లను ఆదుకోవాలని విఘ్నేశ్వరు డికి విన్నవించు కున్నానని తెలిపారు .అనంతరం అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మేడ్చల్ మల్కాజిగిరి డిసిసి ఉపాధ్యక్షులు దమ్మని శ్రవణ్ కుమార్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కుంట సిద్ది రాములును సన్మానించి నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిట్ల ప్రవీణ్ కుమార్ ముదిరాజ్. డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు బి రంగయ్య. తెలంగాణ ఉద్యమం నాయకుడు మాజీ గ్రేట్ హైదరాబాద్ సెక్రెటరీ గుమ్మడి మధుసూదన్ రాజు. తోకల నాగేష్ రెడ్డి. కాలుని సంక్షేమ సంఘ సభ్యులు తదితరులు. పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


