రిమ్స్ NICU ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు . నరేష్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన డీసీసీ అధ్యక్షులు
ఆదిలాబాద్ : నిన్న ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని ఎన్ ఐ సీ యు లో చోటుచేసుకున్న విషాద ఘటన నేపథ్యంలో అస్వస్థత కు గురై ప్రైవేట్ ఆసుపత్రుల లో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు అందుతున్న వైద్య సేవలు, చికిత్సా విధానంపై వైద్యులతో వివరాలు తెలుసుకున్నారు. బాధిత చిన్నారుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.అనంతరం రిమ్స్ ఆస్పత్రిలో ప్రమాదం జరిగిన ఎన్ ఐ సీ యు లో సంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై వైద్య అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యులను కోరారు . బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు రాష్ట్రంలోని ప్రభుత్వం ద్వారా అందిస్తామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మరిన్ని రిమ్స్ కు అదనపు నిధులు కేటాయించేలా ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఆఫీసు ఇంచార్జ్ గౌలి సంజీవ్ కుమార్, మాజీ టిటిడి బోర్డ్ మెంబర్ అనిల్ కుమార్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఖిజార్ పాషా, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు రూపేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఎస్సి విభాగం అధ్యక్షులు పరమేశ్వర్,జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దేవిదాస్ చారి , మందాకిని, ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ వార్డు ప్రెసిడెంట్లు తుమ్మ విశాల్ , బండి సంజయ్, జహీర్,జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


