చేయూత పింఛన్ల లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన.
తాండూరు (వికారాబాద్ జిల్లా) తాండూరు మున్సిపల్ పరిధిలోని 33 వార్డులో చేయూత పించన్ల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి దృవీకరణ పత్రాలను మున్సిపల్ ప్రత్యేక అధికారులు భువనేశ్వరి, నరేష్ లు వార్డులో లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 33 వార్డు పరిధిలో పలువురు వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు చేయూత పించన్ల కొరకు మొత్తం 28 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారు నిజమైన లబ్దిదారులా లేదా అనే విషయాలను సంబంధిత దృవీకరణ పత్రాల ఆధారంగా పరిశీలించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ డి శ్రీకాంత్ రెడ్డి, నాయకులు ప్రహ్లాద్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


