పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం
- అంగన్వాడి సెంటర్లలో బాలింతలకు రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం పై
- తల్లులకు అవగాహన కార్యక్రమం.
గంభీరావుపేట : గంభీరావుపేట మండలం లింగన్నపేట సెక్టార్ పరిధిలోని దేశాయిపేట అంగన్వాడి సెంటర్ లో పోషణ మాసం లో భాగంగా బుధవారం ఆహారంలో వివిధరకాల వంటకాలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను గురించి తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది.అన్ని రకాల పోషకాలు కల్గిన ఆహారం తీసుకోవడం ద్వారా కలిగే లాభాలను వివరించడం మరియు 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన,3 సంవత్సరాలు నిండిన పిల్లలకు అక్షరాభ్యాసం,గర్భిణి స్త్రీలకు శ్రీమంతాలు చేయడం,మరియు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మదేవేందర్ రావు ,ఉపసర్పంచ్ శ్రీమాన్ , ఐసిడిఎస్ సూపర్వైజర్ స్వరూప ,వార్డు మెంబెర్స్ విజయ,లావణ్య, పంచాయతీ కార్యదర్శి ఏఎన్ఎం కల్పలత, అంగన్వాడి టీచర్ శంకరమ్మ వి, వో అధ్యక్షురాలు, స్వప్న తో పాటు పలువురు బాలింతలు మహిళలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


