పెరిక సంఘం సేవలు ఆదర్శప్రాయం - యూనియన్ బ్యాంక్ ఏఎం తోట శ్రవణ్ కుమార్
ములుగు, : పెరిక సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న అన్నప్రసాద వితరణ, సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శప్రాయమని యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ తోట శ్రవణ్ కుమార్ కొనియాడారు.ములుగు జిల్లా కేంద్రంలో పెరిక సంఘం జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద బుధవారం నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా తోట శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ... భక్తి భావంతో పాటు సేవా దృక్పథంతో పెరిక సంఘం సభ్యులు ఐక్యంగా ముందుకు వచ్చి అన్నదానం వంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. పెరిక సంఘానికి తన సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో పెరిక సంఘం జిల్లా అధ్యక్షుడు అక్కల రవి, ఉపాధ్యక్షుడు దిద్ది రాజకుమార్, ములుగు మండల అధ్యక్షుడు చీదర్ల భాస్కర్, ఉపాధ్యక్షుడు రఘోత్తం, డాక్టర్ మార్త శ్రావణ్ కుమార్, గంగిశెట్టి శ్రీనివాస్, ఇండ్ల రాజయ్య, పెట్టెం రాజేందర్, తిరుపతి, కెత్తే ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


