ఐ.టీ టవర్ ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐ.టీ టవర్ ను కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం సందర్శించారు. ఐ.టీ టవర్ కేంద్రంగా కొనసాగుతున్న వివిధ కంపెనీల వివరాలను, వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 13 కంపెనీలలో 380 మంది వరకు పని చేస్తున్నారని టీ.జీ.ఐ.ఐ.సీ జోనల్ మేనేజర్ శివ ప్రసాద్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా కంపెనీల నిర్వాహకులను, అందులో పని చేస్తున్న ఐ.టీ ఉద్యోగుల ను కలిసి స్థానికంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీయగా, వారు సంతృప్తి వ్యక్తం చేశారు. సాధ్యమైనంత మేరకు ఎక్కువ కంపెనీలు స్థానికంగా నెలకొల్పేలా చూడాలని, తద్వారా ఈ ప్రాంత యువత కు స్థానికంగా మరింత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించేందుకు ఆస్కారం ఉంటుందని కలెక్టర్ సూచిం చారు. వినూత్న ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చే స్టార్ట్ అప్ కంపెనీలకు ఐ.టీ టవర్ చక్కటి వేదికగా నిలుస్తుందని, దీనిని ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట టీ.జీ.ఐ.ఐ.సీ ఏ.ఈ శివకృష్ణ ఉన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


