గణేశుని విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి రమేష్

గణేశుని విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి రమేష్

మేడ్చల్ మల్కాజ్గిరి  : వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా బుధవారం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ బండి రమేష్, కూకట్‌పల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశుని విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ 3వ ఫేజ్ మరియు 4వ ఫేజ్లో ఏర్పాటు చేసిన గణేశుని విగ్రహాలను దర్శించుకుని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మూసాపేట్ డివిజన్‌లోని ఆంజనేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుని విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, వినాయక చవితి పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఐక్యతతో జరుపుకోవడం సంతోషకరమన్నా రు. విఘ్నేశ్వర స్వామి ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-09-23 at 3.43.23 PM (1)

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సౌర విద్యుత్ ను సద్వినియోగం చేసుకోవాలి :ఎమ్మెల్యే కడియం శ్రీహరి సౌర విద్యుత్ ను సద్వినియోగం చేసుకోవాలి :ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) :  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రతీ ఒక్కరు సద్వి నియోగం చేసుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే...
పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అవసరం: సర్పంచ్
తిరుమలలో మఖ్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిల నృత్య ప్రదర్శన
చదువుతోనే ఉన్నత భవిష్యత్‌
ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది.
21 కేజీల లడ్డును 74 వేలకు దక్కించుకున్న నారాయణస్వామి
మూసాపేట్‌లో ఘనంగా మహాగణేశునికి పూజలు: