ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది.

  • చికిత్స పొందుతూ మహిళా మృతి.....
  •  స్టేషన్ హౌస్ ఆఫీసర్ తుల శ్రీధర్....

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం.: ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం  12 గంటల సమయం లో మృతురాలు ఆయన కంచం హిందూ, భర్త పేరు అంజయ్య, వయసు 21 సంవత్సరాలు, కులం ముదిరాజ్, వృత్తి కూలి పని, నివాసం సింగీతం గ్రామం, మహమ్మద్ నగర్ మండలం  భగవాన్ బాబాకు చెందిన ఏపీ 28tb 4201 గల ఆటోలో సింగీతం గ్రామం నుండి  బాన్సువాడ వైపు వస్తుండ గా మార్గమధ్య లో కొయ్యగుట్ట వద్ద కు రాగానే అట్టి ఆటో డ్రైవర్ తన యొక్క ఆటోను అతివేగంగా, అజాగ్రత్తగా  నడుపుకుంటూ  రాగ ఆటో అదుపుతప్పి బోల్తాపడగా ఆటోలో ఉన్న హిందూ కు తీవ్ర రక్త గాయాలు కాగా చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినదని మృతురాలి తల్లి అయిన కంచం లక్ష్మి దరఖాస్తు పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వారు తెలిపారు.

Views: 22

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అల్లాదుర్గంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అల్లాదుర్గంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
అందోల్  :తెలంగాణ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికే పెద్దపీట వేస్తోందని వట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్   కొప్పుల లక్ష్మిశేషారెడ్డి అన్నారు.మెదక్ జిల్లా అల్లాదుర్గం...
యరుగండ్లపల్లిలో రికార్డు ధర పలికిన గణేశుడి లడ్డు
గణేష్ ఉత్సవాలకు ఈఎల్వీ ఫౌండేషన్ ఉదారత
సౌర విద్యుత్ ను సద్వినియోగం చేసుకోవాలి :ఎమ్మెల్యే కడియం శ్రీహరి
పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అవసరం: సర్పంచ్
తిరుమలలో మఖ్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిల నృత్య ప్రదర్శన
చదువుతోనే ఉన్నత భవిష్యత్‌