పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అవసరం: సర్పంచ్

పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అవసరం: సర్పంచ్

బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా : కాసిపేట మండలం తాటిగూడ గ్రామపంచాయతీ పరిధిలో ఘన వ్యర్థాల నిర్వహణ–2026 నిబంధనలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ వ్యర్థాలు, గృహ సంబంధిత ప్రమాదకర వ్యర్థాలను వేర్వేరుగా అందించాలని సూచించారు. తడి చెత్తతో ఇంటివద్దే కంపోస్టు తయారు చేసుకోవచ్చని తెలిపారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పంచాయతీ సిబ్బందికి సహకరించాలని సర్పంచ్ మడావి వెంకటేష్ కోరారు. పరిశుభ్రమైన గ్రామ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అన్నపూర్ణ, వార్డు సభ్యులు గుండవెణి రాజశేఖర్, సిడం శ్రీనివాస్, పారిశుధ్య సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అల్లాదుర్గంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అల్లాదుర్గంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
అందోల్  :తెలంగాణ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికే పెద్దపీట వేస్తోందని వట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్   కొప్పుల లక్ష్మిశేషారెడ్డి అన్నారు.మెదక్ జిల్లా అల్లాదుర్గం...
యరుగండ్లపల్లిలో రికార్డు ధర పలికిన గణేశుడి లడ్డు
గణేష్ ఉత్సవాలకు ఈఎల్వీ ఫౌండేషన్ ఉదారత
సౌర విద్యుత్ ను సద్వినియోగం చేసుకోవాలి :ఎమ్మెల్యే కడియం శ్రీహరి
పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అవసరం: సర్పంచ్
తిరుమలలో మఖ్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిల నృత్య ప్రదర్శన
చదువుతోనే ఉన్నత భవిష్యత్‌