ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలో గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక పూజలో పాల్గొన పట్వారీ శశిధర్
మేడ్చల్ మల్కాజ్గిరి : ఉమ్మడి ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలో శంషిగూడా లోని మహంకాళి నగర్, ఆశనగర్, పాపమ్మ బస్తి, పిజేఆర్ నగర్, కమిటీ సభ్యులు కాలనీవాసుల ఆహ్వానంమేరకు ఉమ్మడి ఆల్విన్ కాలనీ 124 డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్ గణేష్ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక డివిజన్ సీనియర్ నాయకులు, కాలనీ పెద్దలు, భక్తులతో కలిసి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని, ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు ప్రజల్లో భక్తి, ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించేలా కొనసాగాలని ఆకాంక్షించారు. గణేష్ మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు, స్థానికులు సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు కిట్టు, బాబ్జి, క్యాటరింగ్ వాసు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సాంబా రెడ్డి, లక్ష్మి, సురేష్, శ్రీను, కృష్ణ, రమేష్, సూరిబాబు, నర్సింహా, సంతోష్ యువకులు,కాలనీవాసులు, మహిళలు, భక్తులు మరియు టీం పట్వారీ తదితరులు పాల్గొన్నారు.
.jpeg)
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


