మూసాపేట్‌లో ఘనంగా మహాగణేశునికి పూజలు:
భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్,
మేడ్చల్ మల్కాజిగిరి : మూసాపేట్ డివిజన్‌లోని నవ యువక అసోసియేషన్స్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ గణేశుని విగ్రహానికి బుధవారం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ , బండి రమేష్ ప్రత్యేక పూజలు* నిర్వహించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. విఘ్నాలను తొలగించే గణనాథుడి ఆశీస్సులతో కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల్లో ఐక్యత, సోదరభావం పెంపొందించడంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత భక్తి, సేవా కార్యక్రమాలతో ముందుకు రావడం అభినందనీయమని బండి రమేష్ అన్నారు. మూసాపేట్‌లో ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నవ యువక అసోసియేషన్స్ సభ్యులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ మాట్లాడుతూ, వినాయకుడి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవడంతో పాటు సామాజిక ఐక్యతను చాటిచెప్పే విధంగా వేడుకలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వినాయక చవితి సందర్భంగా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడంతో పాటు యువతలో ఐక్యతకు దోహదపడుతున్నాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకురాలు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, నవ యువక అసోసియేషన్స్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


