సౌర విద్యుత్ ను సద్వినియోగం చేసుకోవాలి :ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రతీ ఒక్కరు సద్వి నియోగం చేసుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుదవారం స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని రంగారాయగూడెం, ఇప్పగూడ గ్రామంలో ప్రధానమంత్రి కుసుమ్ పథకంలో భాగంగా ట్విలైట్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభించారు. అనంతరం కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు స్వచ్ఛమైన, స్థిరమైన ఇంధన వనరులను అభివృద్ధి చేయవచ్చని అన్నారు. రైతులు, పారిశ్రామిక రంగం మరియు గ్రామీణ ప్రాంతాలకు పునరుత్పాదక ఇంధనం ద్వారా అనేక ప్రయోజనాలు దక్కుతాయని తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణానికి అనుకూలమైన విద్యుత్‌ను అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ సందర్భంగా ట్విలైట్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు కటకం ప్రభాకర్, అందె భాను ప్రసాద్, బోగ శివ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి లను అభినందించారు. సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా పరిశుభ్రమైన విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


