మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు రూ. 1 లక్ష చొప్పున నష్ట పరిహారం ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ
- ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షలు అందించాలి
- మీడియాతో బీఆర్ఎస్ బృందం
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని బుధవారం బీఆర్ఎస్ పార్టీ మహిళ బృందం సభ్యులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, తుల ఉమ మరియు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి జాన్సన్ నాయక్ లు సందర్శించి, అనంతరం ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరిశీలించారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం రూ. 1 లక్ష చొప్పున బీఆర్ఎస్ పార్టీ తరపున నష్ట పరిహారం ప్రకటించారు. ప్రభుత్వం రూ. 25 లక్షల చొప్పున నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


