ఆరోగ్యకరం.. ఆయుర్వేదం
- 11వ ఆయుర్వేద దినోత్సవం
- మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి డెస్క్ : రా ‘ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం’ అనే ప్రధాన సందేశంతో ఈ ఏడాది ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వ్యాధులను నివారించడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడంలో ఆయుర్వేదానికి ఎంతో ప్రాధాన్యత ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స అందించడం కంటే, ముందస్తు ఆరోగ్య పరిరక్షణకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.ఆయుర్వేదం, యోగా ద్వారా ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన పెంచి వ్యాధి నుంచి సంపూర్ణ ఆరోగ్యం వైపు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆయుర్వేదం కేవలం వ్యాధులకు చికిత్స అందించే విధానం మాత్రమే కాదని, ఆరోగ్య పరిరక్షణ, పోషకాహారం, శారీరక–మానసిక ఆరోగ్యం, శరీరం–మనస్సు మధ్య సమతుల్యతకు ప్రాధాన్యతనిచ్చే సమగ్ర వైద్య విధానమని వివరించారు.
ఆయుష్ వైద్య సేవల బలోపేతం
తెలంగాణలో ఆయుష్ వైద్య సేవలను మరింత బలోపేతం చేసి ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. గత రెండున్నరేళ్లలో సుమారు 700 మంది యోగా శిక్షకులను నియమించి ప్రజలకు యోగా, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.ఆయుర్వేదం, హోమియోపతి, యునాని విభాగాల్లో 139 మంది సహాయ ఆచార్యులను నియమించి ఆయుష్ వైద్య విద్య, బోధనా వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు మంత్రి వెల్లడించారు.తెలంగాణ వార్తలు
మూడు జిల్లాల్లో 50 పడకల ఆసుపత్రులు
ప్రజలకు మెరుగైన ఆయుష్ వైద్య సేవలు అందించేందుకు సిద్ధిపేట, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్ జిల్లాల్లో 50 పడకల సమగ్ర ఆయుష్ ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్లు దామోదర్ రాజనర్సింహ తెలిపారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


