సింగూర్ బ్యాక్‌వాటర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

సింగూర్ బ్యాక్‌వాటర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం


సంగారెడ్డి: మనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయిపల్లి గ్రామ శివారులో, సిరూర్–రాయిపల్లి వంతెన సమీపంలోని సింగూర్ బ్యాక్‌ వాటర్‌లో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహం నీటిలో తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసు లకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీశారు. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. మృతదేహంపై నలుపు రంగు దుస్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తించినా, ఆయన కుటుంబ సభ్యులు లేదా ఆచూకీకి సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతుడి వివరాలు, మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. 

Views: 424

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం
హైదరాబాద్ : బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న *“ఇంటింటా ఇందిరమ్మ కుట్టు...
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లో టి. ఆర్.పి పాదయాత్ర
బాలాపూర్ లో స్పీకర్ గడ్డ ప్రసాద్ కు ఘన స్వాగతం
ప్రధాని మోదీ పుట్టినరోజున ప్రతి ఇంట దీపం వెలిగించాలి
సీఎం రేవంత్ రెడ్డి తో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ భేటీ.. 
సెప్టెంబర్‌ 17పై సమరశంఖం!
చాంద టి నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్