జోగిపేట ఆసుపత్రిలో మరో ఇద్దరు వైద్యుల సస్పెన్షన్
- ముఖ్యమంత్రి పర్యటనతో ఆరోగ్యాశాఖలో గుబులు..
- నూతన డిసిహెచ్ఎస్ కూడా నియామకం.
- ఆస్పత్రి ఘటనపై ఇప్పటికే జోగిపేట పోలీస్ కేసు నమోదు.
సంగారెడ్డి :ఆసుపత్రిలో పనిచేస్తూ అక్కడ విధులు నిర్వర్తించాల్సిన ప్రభుత్వ వైద్యులు వారి స్థానంలో ఓ ప్రైవేటు డెంటల్ వైద్యుడితో వైద్య సేవలు అందిస్తున్న సంఘటన ఈ నెల 7న విజన్ ఆంధ్ర బట్టబయలు చేసింది దీనిపై స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సొంత సెగ్మెంట్లో ఇలాంటి వ్యవహారం జరగడం పట్ల ఆయన అధికారులపై సీరియస్ అయ్యారు. ఈ నెల 8న మొదటగా అక్కడ పనిచేస్తున్న డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ రమేష్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సంఘటనలో తాజాగా మరో ఇద్దరు డాక్టర్లు అయిన శివ శంకర్ రెడ్డి, తుల్జా భవానిలను కూడా సస్పెండ్ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నూతన డిసిహెచ్ఎస్ గా డాక్టర్ శ్రీధర్ కుమార్ సంగారెడ్డి జిల్లా నూతన డిసిహెచ్ఎస్గాడాక్టర్ శ్రీధర్ కుమార్ నియమితులయ్యారు. ఈయన ఇప్పటివరకు నారాయణఖేడ్ నియోజకవర్గం కరస్ గుత్తి ఆసుపత్రిలో పర్యవేక్షకుడిగా పని చేశారు. అయితే జోగిపేట ఏరియా ఆసుపత్రి ఘటనలో కొద్ది రోజులుగా డిసిహెచ్ఎస్ లేక పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటివి ఘటనలు జరుగుతున్నాయనే విషయాన్ని విజన్ ఆంధ్ర లో వార్త వచ్చింది. దీనికి ప్రభుత్వం స్పందిస్తూ ఆయనను ఇక్కడ నియమించారు. కాగా ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే ప్రైవేట్ వైద్యుడు (డెంటల్ ) రవి పై జోగిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నారు. మరో ఇద్దరిపై వేటు పడటంతో జిల్లాలో చర్చనీయంషంగా మారింది. ఈ సంఘటనతో జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో తనిఖీలు కొనసాగుతు న్నాయి. జిల్లాకు చెందిన మంత్రి దామోదర్ సొంత శాఖలోనే ఇలాంటి జరుగటం పైగా జిల్లాకు ముఖ్యమంత్రి ఈ నెల 15 న వస్తున్న సందర్భంలో ఈ సంఘటనతో వైద్యరోగ్య శాఖ ఉలిక్కిపడింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


