గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్
- బోథ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
- 50వేల విలువ చేసే 5 గంజాయి మొక్కలు స్వాధీనం
- బోథ్ సీఐ డి. గురుస్వామి
బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లాపూర్ గ్రామ శివారులో వ్యవసాయ క్షేత్రంలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు విశ్వసనీయ సమాచారం మేరకు బోత్ ఎస్‌ఐ వి. పురుషోత్తం, పోలీస్ సిబ్బంది మరియు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి గొల్లాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో గొల్లాపూర్ గ్రామం కి చెందిన ఆత్రం లచ్చు అనే వ్యక్తి వ్యవసాయ క్షేత్రంలో పత్తి పంట మధ్యలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు గుర్తించారు. వ్యవసాయ శాఖ ఏఈఓ పరిశీలించి అవి గంజాయి మొక్కలేనని నిర్ధారించారు. మొత్తం 5 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు యాభై వేల రూపాయలు అంచనా వేశారు. నిందితుడు తక్కువ సమయంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి సాగు చేసి విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడిపై NDPS చట్టం ప్రకారం బోథ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. బోత్ సీఐ డి. గురుస్వామి మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణా మరియు విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుం టున్నారని తెలిపారు.గంజాయి వంటి మాదకద్రవ్యాల సాగుకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


