కుమ్మెర ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి.. దోషులను కఠినంగా శిక్షించండి -డిజిపి శశిధర్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన ఎంపీ, డాక్టర్ మల్లు రవి,ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి డాక్టర్ వంశీకృష్ణ.

నగర్ కర్నూల్ : మార్చ్01 కుమ్మెర గ్రామం జాతరలో జరిగిన పరస్పర దాడులు, చిన్నారి మృతి ఘటనలకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, ఈర్లపల్లి శంకర్ శనివారం రాత్రి డిజిపి శివశంకర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సంఘటనలు జరగడం దురదృష్టకరం. ఈ సంఘటనలు జరగడానికి దారి తీసిన పరిస్థితుల పై లోతుగా విచారణ జరపండి. ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా మేము పూర్తిగా సహకరిస్తాము. దోషులు ఏ స్థాయి వారు అయినా, ఏ పార్టీ వారు అయిన సరే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యేలు డిజిపి కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈ విషయంపై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది.. పూర్తిస్థాయి విచారణ జరిపించి నిజా నిజాలు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


