ఫీజు రీయింబర్స్మెంట్ అబ్బ కాయలను వెంటనే విడుదల చేయాలి.

ఫీజు రీయింబర్స్మెంట్ అబ్బ కాయలను వెంటనే విడుదల చేయాలి.

  • లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
  • బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్ డిమాండ్.

 
తాండూరు , వికారాబాద్ : రాష్ట్రంలోని ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ,ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తాండూర్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తాండూర్ ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్ మాట్లాడుతూ, గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వాలు విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, కళాశాలలు ఫీజులు చెల్లించలేదనే పేరుతో పరీక్షలకు అనుమతించకపోవడం, సర్టిఫికెట్లు నిలిపివేయడం, హాస్టళ్ల నుంచి బయటకు పంపించడం వంటి అమానుష ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయినప్పటికీ, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఆ హక్కు కాలరాయబడుతోందని, మహానేత ఆర్. కృష్ణయ్య పోరాట ఫలితంగా దివంగత ముఖ్య మంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని అనంతరం వచ్చిన ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడు తోందని, ఎన్నికల హామీలను విస్మరించి యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోందని మండిపడ్డారు. ప్రస్తుతం రూ.8,000 కోట్లకు పైగా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి కళాశాలలకు చెల్లించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకుర్, బీసీ సంఘం మహిళ జిల్లా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, బషీరాబాద్  మండల్ మహిళా అధ్యక్షురాలు వీరమని, మీడియా ఇంచార్జ్ బసవరాజ్, బీసీ సంగం నాయకులు జోసఫ్, రాజు గౌడ్,  పరమేష్, తాండ్ర నరేష్, మంతటి రాజు, గొట్లపల్లి రామ్, కిరణ్,  కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. 
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం  తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం 
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
నేరాల నివారణకు కృషి చేయాలి: ఏసీపీ కిరణ్ కుమార్
గజ్వేల్‌లో ఘనంగా ‘ప్రపంచ రేంజర్ల దినోత్సవం’
20 వ నిర్మాణాత్మక సమీక్ష సమావేశం 
తోగుట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ
ఇటిక్యాల బాధిత రైతులకు న్యాయం చేయాలి : రాజలింగం
సిబియల్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ పని దినాలు కల్పించాలి