ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కార్యక్రమం

 ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కార్యక్రమం

చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా, చౌటకూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఓపెన్ స్కూల్ ప్రవేశా లపై ప్రత్యేక అవగాహన, నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యను మధ్యలోనే నిలిపివేసిన వారు (డ్రాపౌట్స్), వివిధ కారణాల వల్ల సాధారణ పాఠశాల విద్యను కొనసాగించలేకపోయిన వారికి ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను పునరు ద్ధరించుకునే మంచి అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీ ఎస్. వెంకటస్వామి పాల్గొని ఓపెన్ స్కూల్‌లో అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలు, ప్రవేశ ప్రక్రియ, విద్యార్థులకు కలిగే ప్రయోజనాల గురించి క్షుణ్ణంగా వివరించారు. చదువు ను మధ్యలో ఆపేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్య దిశగా ముందుకు సాగాలని సూచించారు. పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు  రామాదేవి మాట్లాడుతూ.. విద్యకు దూరమైన వారికి పునరావకాశం కల్పించడమే ఓపెన్ స్కూల్ ప్రధాన ఉద్దేశమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రవేశాలను వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కోఆర్డినేటర్ మోహన్‌రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలి
ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కార్యక్రమం
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి..
భారీ వర్షాలతో ఉట్నూర్–మత్తడిగూడ వాగుపై రాకపోకలు నిలిచివేత
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోలి సంతోష్
చక్రియాల గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవాలు