కాజీపేటలో అదనపు రైలు హాల్టులు,
నిలిపివేసిన రైళ్లను పునరుద్ధరించాలి.
వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిలకు వినతిపత్రం అందజేసిన రహమతుల్లా మహమ్మద్
కాజీపేట: వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ని, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ని కలిసి, కాజీపేట రైల్వే స్టేషన్‌లో మరిన్ని ముఖ్యమైన రైళ్లకు హాల్టులు కల్పించడంతో పాటు, కోవిడ్-19 అనంతరం నిలిపివేసిన రైలు సర్వీసులను పునరుద్ధరించాలని కాంగ్రెస్ నాయకుడు రహమతుల్లా మహమ్మద్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రహమతుల్లా మహమ్మద్ మాట్లాడుతూ కాజీపేట మీదుగా అనేక ముఖ్యమైన రైళ్లు ప్రయాణిస్తున్నప్పటికీ కొన్ని రైళ్లకు ఇక్కడ హాల్టు లేకపోవడం వల్ల వరంగల్–హనుమకొండ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రత్యేకంగా 20833/20834 విశాఖపట్నం–సికింద్రాబాద్ వందే భారత్, 12649/12650 కర్ణాటక సంపర్క్ క్రాంతి, 18111/18112 యశ్వంత్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, 12739/12740 విశాఖపట్నం–సికింద్రాబాద్ గరీబ్ రథ్ రైళ్లకు కాజీపేటలో హాల్టు కల్పించాలని కోరారు.అదేవిధంగా కోవిడ్-19 తర్వాత నిలిపివేయబడిన కాజీపేట–బెలగావి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇతర రైలు సర్వీసులను కూడా పునరుద్ధరించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డుపై అవసరమైన స్థాయిలో ప్రతిపాదనలు చేయాలని ఎంపీ డా. కడియం కావ్య ని, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ని కోరారు.కాజీపేటకు అదనపు రైలు హాల్టులు, నిలిపివేసిన సర్వీసుల పునరుద్ధరణ జరిగితే వరంగల్–హనుమకొండ ప్రజలకు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు మరియు ఇతర ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుం దని రహమతుల్లా మహమ్మద్ పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


