TGEJAC ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన.
మంచిర్యాల టౌన్: TGEJAC రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమంలో భాగంగా RDO కార్యాలయం మంచిర్యాల ఉద్యోగులు అందరూ TGEJAC మంచిర్యాల జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. చైర్మన్ గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు అయిన ఒకటవ పి ఆర్ సి వెంటనే అమలు చేయాలని సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేయాలని, ఆరు పెండింగ్ డిఎ లు ఇవ్వడం, ఎన్ఈహెచ్ఎస్ ను సమర్థవంతంగా అమలు చేయడం మరియు 12 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని మరియు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు 17% హెచ్ ఆర్ ఏ ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంచిర్యాల జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ సెప్టెంబర్ 10 తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయం పరిపాలన అధికారి కే రమేష్, ఉద్యోగులు రవి కిషోర్, సతీష్ , పద్మశ్రీ, అనూష ,వినోద్ ,మల్లేష్, జనార్దన్, జీనత్, షారుక్, మహేందర్, అరుణ, సుమంత్ , రజిత , నరేష్, నరేందర్, రాజం, పోచం, పద్మ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


