తెలంగాణ సంకల్ప సభను విజయవంతం చేయండి : కొట్టాల
గజ్వేల్/సిద్దిపేట : సామాజిక న్యాయం, బడుగులకు రాజకీయ ప్రాతినిధ్యం లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేన ఈ నెల 6న సరూర్‌నగర్, ఇండోర్ స్టేడియంలో తలపెట్టిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు గజ్వేల్ నుండి 1000 మంది ముఖ్య కార్యకర్తలతో తరలి వెళ్తున్నట్లు హైకోర్టు న్యాయవాది, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జి కొట్టాల యాదగిరి ముదిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా గజ్వేల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా వారి స్ఫూర్తితో టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ ప్రతినిధులు హాజరుకానున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఆశించిన సామాజిక న్యాయం జరగలేదని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి వర్గానికి, వెనుక బడిన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పిoచడం ఈ సదస్సు ఏర్పాటు లక్ష్యమని అన్నారు. సంకల్ప సభతో పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ సామాజిక న్యాయం అమలు తదితర ప్రజల అభిప్రాయాన్ని పాలకుల దృష్టికి బలంగా తేనున్నట్లు చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆకాంక్షించిన సామాజిక తెలంగాణ నిర్మాణమే సభ లక్ష్యమని, రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారంలో సముచిత వాటా కల్పించే దిశగా ఈ సభా వేదిక అడుగులు వేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నేతలు ఎడ్ల నర్సింలు, శ్రీకాంత్, స్వామి, అమర్ సింగ్, చందు, ప్రసాద్, కుమార్, వెంకటేష్, అశోక్, రాజేష్, కిషన్, నవీన్, పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
