బాలసభలతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి
దౌల్తాబాద్, : మండలంలోని గొడుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం గ్రామ సర్పంచ్ మద్దెల వనజ స్వామి అధ్యక్షతన బాలసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల కోసం బాలలే నిర్వహించుకునే బాలసభలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందిస్తాయని అన్నారు. పాఠశాల ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో రాణించాలని సూచించారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని ఉపాధ్యాయులు, గ్రామ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి గ్రామపంచాయతీ తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, పంచాయతీ కార్యదర్శి మల్లేశం, ప్రధానోపాధ్యాయుడు బాల్‌రెడ్డి, వార్డు సభ్యుడు దుర్గని నర్సింలు, అంగన్‌వాడీ టీచర్ రేఖ నాగరాణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


