సకాలంలో స్పందించిన పోలీసులు

ప్రజల ప్రశంసలు అందుకున్న మేడిపల్లి పోలీస్ సిబ్బంది

సకాలంలో స్పందించిన పోలీసులు

మేడిపల్లి/భీమారం (జగిత్యాల) :నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురు గాలుల ప్రభావంతో మేడిపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారి ఎన్‌హెచ్-63పై బుధవారం ఉదయం 5గంటలకు ఓ భారీ వృక్షం కూలి రోడ్డుకు అడ్డంగా పడింది. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మేడిపల్లి పోలీసులు ఈ ఘటనను గమనించి వెంటనే అప్రమత్తమవడంతో భారీ ప్రమాదం తప్పింది. పెట్రోలింగ్ సిబ్బంది ఆలస్యం చేయకుండా జేసీబీ యజమాని జలంధర్, మహేష్ సహకారంతో వృక్షాన్ని తొలగించి రహదారిని పూర్తిగా క్లియర్ చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. విధి నిర్వహణలో చురుకుగా వ్యవహరించి ప్రమాదాన్ని నివారించిన పోలీసు సిబ్బంది నాగరాజును మేడిపల్లి మండల ఎస్సై శ్రీధర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రహదారులపై ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ఎక్కడైనా చెట్లు కూలడం, రోడ్లు దెబ్బతినడం, ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Views: 144

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత