జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ

జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ

  • చౌటకూర్ మండలంలో పంచాయతీ సిబ్బందికి అవగాహన 
  • అభివృద్ధి పనుల సమర్థ అమలుపై అధికారుల దిశానిర్దేశం

చౌటకూర్,: చౌటకూర్ మండల కేంద్రంలో మంగళవారం జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ (ఇంకుడు గుంతలు) అమలుకు సంబంధించి రాష్ట్రస్థాయి నుంచి ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో భాగంగా పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, మేట్లకు ఈ శిక్షణ అందించారు.శిక్షణలో జలసిరి ఫామ్ పౌండ్ల నిర్మాణ విధానం, వ్యక్తిగత సోక్ పిట్స్ ఏర్పాటు, పనుల ఎంపిక, నాణ్యతా ప్రమాణాలు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పనుల అమలు, ప్రజలకు కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై రాష్ట్రస్థాయి నిపుణులు సమగ్రంగా వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పారిశుద్ధ్య మెరుగుదల లక్ష్యంగా ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కే. శంకర్, సహాయ ప్రాజెక్టు అధికారి (ఏపీఓ) రామ్మోహన్, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ మహేశ్వర్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు ప్రతాప్ రెడ్డి, రమేష్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు పాల్గొని శిక్షణను పూర్తిచేశారు.శిక్షణలో పాల్గొన్న అధికారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గ్రామాల్లో జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ పనులను నాణ్యతతో, వేగవంతంగా అమలు చేసి గ్రామీణాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. 
Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ