‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 

‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 

  • కమిషనర్ ను దూషించిన చైర్ పర్సన్ భర్త
  • ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు 

మందమర్రి,  : మందమర్రి మండల కేంద్రంలోని క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి భర్త డాక్టర్ రాజా రమేష్ మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ విధులకు ఆటంకం కలిగించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఓ వార్డులో శిధిలావస్థకు చేరిన ఇంటిని పరిశీలించేందుకు వెళ్లిన మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణపై చైర్ పర్సన్ భర్త డాక్టర్ రాజా రమేష్ అసభ్య పదజాలంతో దూషిస్తూ తన విధులకు ఆటంకం కలిగించారని స్థానిక పోలీస్ స్టేషన్లో కమిషనర్ మురళీకృష్ణ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వార్డుల పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని తెలుపడం లేదంటూ చైర్ పర్సన్ భర్త రాజా రమేష్ కమిషనర్ మురళీకృష్ణను నిలదీయడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దూషించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఇద్దరి మధ్య జరిగిన చిన్న వివాదం ఏకంగా దాడులకు దారి తీశాయి. 
నీ అంతు చూస్తానంటూ’ బెదిరించారు
కమిషనర్ మురళీకృష్ణ  బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న తనపై చైర్ పర్సన్ భర్త రాజా రమేష్ ‘నీ అంతు చూస్తానంటూ’ బెదిరించిన తీరు బాధాకరమని మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ అన్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఒకటో వార్డులో సమస్యాత్మక ప్రాంతాలను, ఇండ్లను సందర్శించేందుకు వెళ్లిన క్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్ ఫోన్ ద్వారా ఇష్టం వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ‘నీ అంతు చూస్తానంటూ’ బెదిరించారని తెలిపారు. విధుల్లో ఉన్న అధికారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగిన రాజా రమేష్,రామిడి కుమార్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఏఎస్సై వెంకన్నకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. జరిగిన విషయంపై ఇప్పటికే జిల్లా పై అధికారులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.
నియంతలా వ్యవహరిస్తున్న కమిషనర్’
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాల్సిన కమిషనర్ మురళి కృష్ణ నియంతలా వ్యవహరిస్తున్నారని చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి ఆరోపించారు. 22 వార్డుల్లో అభివృద్ధి చేయాల్సింది పోయి కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిచిన వార్డులలో మాత్రమే పనులు చేస్తున్నారని విమర్శించారు. మహిళా చైర్ పర్సన్ కు కనీస గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వార్డు సందర్శనలో భాగంగా చైర్ పర్సన్,వార్డు కౌన్సిలర్లకు కనీస సమాచారం ఇవ్వడమలేదన్నారు. అలాగే నూతన ఇండ్ల నిర్మాణాలను ఆపుతూ ఇంటి యాజమానులను ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిపారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. తన భర్త రాజా రమేష్ సైతం మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణపై పోలీస్ స్టేషన్లో లికిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పారు.  
బీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యం నశించాలి 
విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారిపై బీఆర్ఎస్ నాయకుడు,చైర్ పర్సన్ భర్త డాక్టర్ రాజా రమేష్,సీనియర్ నాయకుడు రామిడి కుమార్ దూషించిన తీరును కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక సూపర్ బజార్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు వోడ్నాల శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణకు క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులకు,కార్యకర్తలకు దాడులు చేయడం అలవాటుగా మారిందన్నారు. అధికారులను,చట్టాన్ని గౌరవించకుండా వ్యవహరిస్తున్న వారిపై చట్టం తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు పల్లె రాజు,యాకుబ్ అలీ,కౌన్సిలర్లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
1010788418
 
 
Views: 76

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత