లబ్ధిదారులకు సీఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ
రేగోడ్ (మెదక్ ): రేగోడ్ మండలం కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం నందు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ఆదేశాలతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 10 మంది లబ్ధి దారులకు సుమారు రూ" 2,82,000/- ల చెక్కులను పీసీసీ మెంబెర్ మున్నూరు కిషన్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాంరాయినోళ్ళ దిగంబర్ రావు చేతులమీదుగా పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ప్రతి పెదవాడికి ప్రజా ప్రభుత్వం మంత్రి దామోదర్ రాజనర్సింహా అండ ఉంటుందని తెలిపారు.ఈ సందర్బంగా లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి దామోదర్ రాజనర్సింహా కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్ లు,మండల నాయకులు పీర్యనాయక్ ,నర్సింలు,ఉప సర్పంచ్ సాగర్,మఠం శివరాజయ్య స్వామి ,గంగారెడ్డి ,జయరాజ్ ,విఠల్,అలిగే డిషప్,భాను ప్రకాష్ గుప్తా,రాములు,వీరన్న,సుభాష్ రావు,మధు తదితరులు పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
