శ్రీ సాయి గణపతి ఆలయంలో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు
– హాజరైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
గండిపేట (రంగారెడ్డి):గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కిస్మత్‌పూర్ పరిధిలోని సాయిబాబా నగర్ కాలనీలో వేంచేసియున్న శ్రీ సాయి గణపతి దేవాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాల లో ఆయన పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసి, వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడూ.. పవిత్రమైన గురు పౌర్ణమి రోజున సాయి బాబా దివ్య సమక్షంలో పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. స్థానిక ప్రజలకు, భక్తులకు ఈ సందర్భంగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. గురువుల బోధనలు సమాజంలో సన్మార్గం వైపు నడిపిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు మరియు నాయకులు పాల్గొన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణ, సాయి నామస్మరణతో మారుమోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


