ఘనంగా మారుతి సాగర్ జన్మదిన వేడుకలు
- జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం
- TUWJ H-143ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర: జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా
వేములవాడ, : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ H-143) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ జన్మదిన వేడుకలు వేములవాడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జర్నలిస్టులు కేక్ కట్ చేసి మారుతి సాగర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమం, అక్రిడిటేషన్ల మంజూరు, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం మారుతి సాగర్ నిరంతరం పోరాడుతున్నారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమ సమయంలో జర్నలిస్టుల గొంతుకగా నిలిచిన ఆయన.. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా మీడియా ప్రతినిధుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు, అక్రిడిటేషన్ల మంజూరు, పాత్రికేయుల వృత్తి గౌరవం పెంపు వంటి అంశాలపై నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలపై ముందుండి పోరాటం జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో, సంఘాన్ని బలోపేతం చేయడంలో మారుతి సాగర్ కీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రతి పాత్రికేయుడికి న్యాయం జరిగేలా నిరంతరం ఉద్యమాలు చేపడుతూ జర్నలిస్టు సమాజానికి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఐక్యతే సంఘానికి ప్రధాన బలమని, ఆ ఐక్యతను కాపాడుతూ TUWJ H-143ను రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేయడంలో మారుతి సాగర్ కీలక పాత్ర పోషిస్తున్నారని లాయక్ పాషా అన్నారు. జర్నలిస్టుల హక్కుల కోసం ఆయన చేస్తున్న పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మారుతి సాగర్ ఆయు రారోగ్యాలతో, సుఖసంతోషాలతో చిరకాలం జీవిస్తూ జర్నలిస్టు సమాజానికి మరింత సేవ చేయాలని జిల్లా కమిటీ, వేములవాడ ప్రెస్ క్లబ్ సభ్యులు ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ, ముఖ్య సలహాదారులు కొత్వాల్ శ్రీనివాస్,ఉపాధ్యక్షుడు సిహెచ్. దేవరాజ్ జిల్లా క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ రసూల్, , పంపరి నాగరాజు, ఫహద్, దెబ్బేటి ప్రవీణ్, రాపెల్లి గంగాధర్, సంటి రాజేందర్, షబ్బీర్, బండి రజని, ఆసీమ్, లక్ష్మీనారాయణ, రాము తదితరులు పాల్గొని మారుతి సాగర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Views: 29
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
