వర్గల్ క్షేత్రంలో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాదరి క్షేత్రంలో బుధవారం గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ పండితులు శ్రీ వ్యాస మహర్షితోపాటు ఆధ్యాత్మిక సంపన్నులు, సనాతన ధర్మ మార్గ దర్శకులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద గురువులు అభి రామాచార్యులు, శ్రీనివాసచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ శర్మ తదితరులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాస పౌర్ణమి హిందూ సంస్కృతి, సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజు కాగా, అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించే గురువులను స్మరించుకుని రుణం తీర్చుకోవాలని స్పష్టం చేశారు. ఈ పవిత్రమైన రోజు గురు పౌర్ణమి విశిష్టత, ప్రాముఖ్యత గుర్తు చేస్తుండగా, జగద్గురువు శ్రీ వ్యాస మహర్షిని తొలి గురువుగా పూజించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, ఆ జన్మకు సార్థకతను, సరైన మార్గాన్ని చూపించేది గురువులు కాగా, జీవితంలో విద్య, జ్ఞానం, క్రమశిక్షణ, మంచి మార్గం నేర్పిన గురువును దర్శించుకుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.
Views: 170
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
