గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించిన శ్రీ అక్షర పాఠశాల

గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించిన శ్రీ అక్షర పాఠశాల

  • ఉపాధ్యాయులను సన్మానించిన యాజమాన్యం
  •  భావోద్వేగానికి గురిచేసిన విద్యార్థుల ప్రసంగాలు

ముధోల్ : గురువు జీవితంలో వెలుగునిచ్చే దైవస్వరూపుడని చాటి చెబుతూ ముధోల్ పట్టణంలోని శ్రీ అక్షర పాఠశాలలో బుధవారం గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులకు పాదపూజ చేసి పూలు సమర్పించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ, "సార్... మీరు మందలించినప్పుడు బాధపడ్డాం. కానీ ఈ రోజు మీ బోధన వల్లే ఈ స్థాయికి చేరుకున్నామని అర్థమైంది" అంటూ తమ గురువుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేయడంతో అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల డైరెక్టర్ జే. సుభాష్ మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి గొప్పతనాన్ని వివరించారు. ఒక ఇంజనీర్‌, డాక్టర్‌, కలెక్టర్‌, శాస్త్రవేత్తను తీర్చిదిద్దేది గురువేనని, దేశ భవిష్యత్తుకు పునాదులు తరగతి గదిలోనే వేయబడతాయని అన్నారు. విద్యార్థులు గురువులను గౌరవించడం ద్వారానే నిజమైన విద్య సార్థకమవుతుందని, గురువులను గౌరవించే విద్యార్థులే రేపటి ఆదర్శ పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. అనంతరం వ్యాసమహర్షి ప్రాముఖ్యత, గురుపూర్ణిమ చరిత్రను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమం ముగింపులో పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించింది. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని గురుపూర్ణిమ వేడుకలను విజయవంతం చేశారు. 
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత