ప్రత్యేక శిక్షణ తరగతులను
డిస్టిక్ లెవెల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభించిన హవేలీ ఘనపూర్ జడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్
పాపన్నపేట, : హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి ఇన్ సర్వీస్ వ్యాయామ ఉపాధ్యాయుల పీఈటీ, పీడీల శిక్షణ కార్యక్రమం 29 బుధవారం నాడు మొదటి రోజు అత్యంత ఉత్సాహభరితంగా ప్రారంభమైంది సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ ప్రత్యేక శిక్షణ తరగతులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్, ఎస్ జి ఎఫ్ సెక్రటరీ నాగరాజు ప్రారంభించారు, ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ విద్యాసంస్థల వ్యాయామ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ముఖ్యంగా జిల్లా పరిషత్ వ్యాయామ ఉపాధ్యాయులు మోడల్ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల వ్యాయామ ఉపాధ్యాయురాలు మరియు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ఈ శిక్షణలో భాగ్య సామలయ్యారు ఈ సందర్భంగా టిజిపేట అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, పేటా టి ఎస్ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ నూతన విద్య విధానంలో భాగంగా విద్యార్థుల శరీరక మానసిక వికాసానికి వ్యాయామ విద్య ఎంతో కీలకమని పేర్కొన్నారు అన్ని కేటగిరీల పాఠశాలలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు ఒకే వేదిక పైకి వచ్చి ఈ శిక్షణ పొందడం వల్ల క్రీడల అభివృద్ధికి పాఠశాలల మధ్య క్రీడా సమన్వయానికి ఎంతో దోహదపడుతుందని కొనియాడారు మొదటి రోజు శిక్షణ విశేషాలు నూతన క్రీడా నియమాలు ఆధునిక క్రీడా నిబంధనలు, డిజిటల్ స్కోరింగ్ లో వస్తున్న మార్కులపై మొదటి రోజు అవగాహన కల్పించారు ఈ క్రీడా స్ఫూర్తి నైపుణ్యాలు గ్రామీణ మరియు వసతి గృహాలలో ఉండే విద్యార్థులలో క్రీడా నైపుణ్యాలను ఎలా వెకితీయాలనే అంశంపై రిసోర్స్ దిశా నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో రిసర్స్ పర్సన్ రవి దేవానంద్ నరేష్ శ్వేత వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Views: 171
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
