భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక పటాన్చెరు.
- ఎస్ఐఆర్ లో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత..
- ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం స్థానికంగానే ఓటరు నమోదు చేయించుకోండి..
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి
పటాన్ చెరు(సంగారెడ్డి): మినీ ఇండియగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఇతర రాష్ట్రాల ఓటర్లు స్థానికంగానే తమ ఓటు వివరాలను నమోదు చేసుకుని.. పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో రాజస్థాన్, గుజరాత్, శ్రీకాకుళం, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ప్రజలతోపాటు, వివిధ రంగాల వ్యాపారస్తులతో ఎస్ ఐ ఆర్ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై దిశ నిర్దేశం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 25 సంవత్సరాల తర్వాత ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపడుతోందాన్ని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు స్థానికంగా నివాసమే ఏర్పాటు చేసుకొని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని.. వారందరూ విధిగా స్థానికంగానే ఓటరు వివరాలు నమోదు చేసుకోవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రజలందరినీ సొంత బిడ్డల వలె చూసుకుంటున్నామని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యేకంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియడానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉందని.. వివరాలు నమోదు చేయించుకొని వారందరూ తప్పనిసరిగా వివరాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మెట్టు కుమార్ యాదవ్, బాల్ రెడ్డి, విజయ్ కుమార్, బిక్షపతి, పృథ్వీరాజ్, వెంకటేష్, దామోదర్ రెడ్డి, తేజ, రాజు, రామ్మోహన్, వివిధ సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
