ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ క్లినిక్ లపై చర్యలు శూన్యం.

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ క్లినిక్ లపై చర్యలు శూన్యం.

  • భారీగా ముడుపులు అందుతున్నాయనేఆరోపణలు.
  • హైదరాబాద్ బృందాల దాడితో వెలుగులోకి.
 

నిజామాబాద్ :జిల్లా ఉన్నతాధికారులు కొలువుదీరిన  నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ క్లినిక్ ల పై చర్యలు శూన్యంగా మారాయి. వైద్య ఆరోగ్యశాఖలోని కొందరి అధికారులకు భారీగా మలుపులు ముట్టడం వల్లే అక్రమ క్లినిక్ లపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ క్లినిక్ ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్ లేకున్నా అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్య బృందాలు దాడులు నిర్వహించడం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న వైద్యాధికారులు అక్రమ క్లినిక్ లపై చర్యలు తీసుకోకపోవడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా కేంద్రంలోని పెద్ద బజారు ప్రాంతంలో గల  భారత్ క్లినిక్ ను ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్ లేకుండానే కొనసాగుతుంది. సదరు క్లినిక్ పై అనేక ఫిర్యాదులు అందడంతో  స్పందించిన తూ తూ మంత్రంగా చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నారు. ఇటీవల కాలంలో నకిలీ వైద్యులపై చర్యలు చేపడుతున్న జిల్లా వైద్య ఆరోగ్య  శాఖ భారత్ క్లినిక్ పై సానుభూతిగా వ్యవహరించడం వెనుక పెద్ద ఎత్తున మామూళ్లు అందినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.జిల్లా కేంద్రంలోని పెద్ద బజారు ప్రాంతంలో గల ఏళ్ల తరబడి కొనసాగుతున్న భారత్ క్లినిక్ ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం ప్రభుత్వ ఆదాయానికి  గండి పడింది. ఇది కేవలం వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం పల్లె  అ క్లినిక్ తో ఇష్ట రాజ్యాంగ కొనసాగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యారోగ్య శాఖలోని కొందరికి భారీగా ముడుపులు ముట్టడం వల్లే సీజ్ చేయాల్సిన క్లినిక్ ను తాళం వేసి సరిపెట్టారు. దానిని ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ప్రభుత్వానికి ఆదాయం చేకూరేదన్న ప్రచారం జరుగుతుంది.. భారత్ క్లినిక్ లో ఇదొక తంతు అయితే మరో విచిత్రం ఏమిటంటే సీనియర్ వైద్యుని  స్థానంలో మరొక వైద్యురాలు చికిత్స చేయడం నిబంధనలకు విరుద్ధమే. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తూతు మంత్రముగా చర్యలు చేపట్టడం వెనుక  ఆంతర్యం ఏమిటో అంతుచిక్కడం లేదు. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నకిలీ వైద్యుల నిర్వాకంపై  కొరడాజూళీ పించిన వైద్య ఆరోగ్యశాఖ  అధికారులు భారత్ క్లినిక్ పై  నామమాత్రపు చర్యలు  చేపట్టడం విమర్శలకు దారి తీస్తుంది. భారత్ క్లినిక్ ను ఏళ్ల తరబడి ప్రముఖ వైద్యుడు కృష్ణమూర్తి కొనసాగిస్తున్నారు. వయసు రీత్యా  కృష్ణమూర్తి ఇంటికే పరిమితం కావడంతో  ఆయన స్థానంలో నిబంధనలకు విరుద్ధంగా అఖిల అనే వైద్యురాల్ని  నియమించి వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడులు నిర్వహించి ఏలాంటి చర్యలు తీసుకోకుండా తాత్కాలికంగా మూసివేయడం భారీగా ముడుపులు అందినట్లు  సమాచారం. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని కసాబ్ గల్లీలో ఓ అక్రమ క్లినిక్ ను హైదరాబాద్ నుండి వచ్చిన ప్రత్యేక బృందం సీజ్ చేయడం స్థానిక అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. ఇదే ప్రాంతంలో మరికొన్ని క్లినిక్ లు అక్రమంగా నడుస్తున్న చర్యలు తీసుకోకపోవడం వెనుక భారీగా మామూలు అందుతున్నాయన్న విమర్శలు సార్వత్ర వ్యక్తం అవుతున్నాయి. 
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత