బిజెపి నూతన చట్టాలతో కార్మికులకు అన్యాయం
- అఖిలభారత ఐఎన్‌టియుసి అధ్యక్షులు సంజీవరెడ్డికి గురుపౌర్ణమి శుభాకాంక్షలు
- శుభాకాంక్షలు తెలిపిన కొలుకూరి నర్సింహారెడ్డి.
పటాన్ చెరు(సంగారెడ్డి): సంగారెడ్డి జిల్లా ఐఎన్టియుసి అధ్యక్షులు కొల్కురి నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో అఖిల భారత ఐఎన్టియుసి అధ్యక్షులు డాక్టర్ జి సంజీవ రెడ్డిని వారి నివాసం హైదరాబాద్ లో కలిసి గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో కార్మిక హక్కులను బీజేపీ మోదీ ప్రభుత్వం హరిస్తూ నష్టాలకు గురిచేస్తుందని, అఖిల భారత ఐఎన్టియుసి అధ్యక్షులు డాక్టర్ జి సంజీవ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఐఎన్టియుసి పటాన్ చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బిజెపి మోడీ ప్రభుత్వం పై నీట్ పరీక్ష పత్రం లిక్ కారణంగా విద్యార్ధులు జంతర్ మంతర్ వద్ద చేసిన పోరాట స్పూర్తితో కార్మిక హక్కులపై పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసియన్ పెయింట్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు చంద్ర మౌళి, బాలకృష్ణ, అమర్, సింహా రెడ్డి, శ్రీదర్, సత్యనారాయణ, సుబ్బయ్య, వేణుగౌడ్, జాకబ్, రాజు, రఘుపతి రెడ్డి, మహేందర్, భోజరాజు తదితరులు పాల్గొన్నారు
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
