రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పాపన్నపేట, : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు...యూసుఫ్ పేట గ్రామానికి చెందిన బోల వెంకటేశం(42) వ్యవసాయం చేసుకుంటూ జీవితం గడుపుతున్నాడు.మంగళవారం సాయంత్రం కూరగాయల తీసుకురావడానికి ఇదే గ్రామానికి చెందిన రవితో కలిసి తన టీవీఎస్ ఎక్స్ఎల్ పై పొడిచన్ పల్లి గేటు వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా లక్ష్మీనగర్ గ్రామ శివారులోనికి రాగానే వెనక వైపు నుంచి వచ్చిన బొలెరో ట్రాలీ వాహనం డీకొట్టడంతో కింద పడ్డారు.తీవ్ర గాయాలతో ఉన్న వారిని స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ డాక్టర్లు గమనించి వెంకటేశం అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు.మృతుడి భార్య శోభ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Views: 305
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
