భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
ఘనంగా గురుపౌర్ణిమ పూజోత్సవాలు
నిజామాబాద్,: జిల్లాలోని సాయిబాబా ఆలయాలు గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 5 గంటల నుండి భక్తులు ఆలయాల వద్దకు విచ్చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జిల్లాలోని మాధవనగర్ సాయిబాబా ఆలయంలో చైర్మన్ మీనా శ్రీనివాస్ దంపతులు, ఆలయ డైరెక్టర్లు ప్రత్యేక హోమం నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. రైల్వే కమాన్ తేనె సాయిబాబా ఆలయంలో భక్తులు విశేష పూజలు చేసి తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో మంగి రాములు మహారాజు స్వామికి భక్తులు పాదపూజలు చేశారు. ఈ సందర్భంగా మంగి రాములు మహారాజ్ మాట్లాడుతూ మనుషులకు ఓర్పు సహనంతో పాటు పెద్దలపట్ల భక్తి గౌరవాలు కలిగి ఉండాలన్నారు. కేదారేశ్వర ఆశ్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి మంగి రాములు స్వామీజీ ఆశీస్సులు పొంది అన్న ప్రసాదాలు స్వీకరించారు. గురు పౌర్ణమి సందర్భంగా పలు పాఠశాలలలో విద్యార్థులు గురువులను సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


