సూపర్ ఎల్‌నినో ప్రభావానికి ముందస్తు చర్యలే రక్షణ

ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి రైతు పంటకుంట ఏర్పాటు చేసుకోవాలి

సూపర్ ఎల్‌నినో ప్రభావానికి ముందస్తు చర్యలే రక్షణ

చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని చౌటకూర్, వెంకట కృష్ణాపురం, తార్దన్ పల్లి , గ్రామపంచాయతీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జలసిరి ప్రత్యేక గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కే. శంకర్ ముఖ్య అతిథిగా హాజరై జల సంరక్షణ ప్రాధాన్యంపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ ఏడాది సూపర్ ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని, దాని కారణంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే జూలై నెల ముగిసే దశలో ఉన్నప్పటికీ అనేక చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండలేదని, అందువల్ల ప్రతి నీటి బొట్టును సంరక్షించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.వర్షపు నీరు వృథాగా కాలువలు, వాగుల ద్వారా  వెళ్లిపోకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూగర్భ జలాల పెంపుదలే జలసిరి కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ ప్రతి ఇంటి వద్ద తప్పనిసరిగా ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో పంటకుంట నిర్మించుకోవాలని కోరారు.ఇళ్లలో వినియోగించిన నీరు, పైకప్పులపై నుంచి వచ్చే వర్షపు నీటిని ఇంకుడు గుంటల ద్వారా భూమిలోకి మళ్లిస్తే భూగర్భ జలాలు పెరిగి భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తగ్గడంతో పాటు వ్యవసాయానికి కూడా నీటి లభ్యత మెరుగుపడుతుందని తెలిపారు. జల సంరక్షణ కార్యక్రమాల్లో ప్రతి గ్రామస్తుడు భాగస్వామి కావాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ గ్రామసభలో గ్రామ సర్పంచ్ పార్కుల రామిరెడ్డి, సర్పంచ్ గణేష్, సర్పంచ్ పమేనోళ్ల అంజమ్మ ,పంచాయతీ కార్యదర్శి సిద్దమ్మ, కార్యదర్శి సందీప్ గౌడ్, ఉపాధి హామీ పథకం సిబ్బంది, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బంది, రైతులు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Views: 90

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత