పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
నల్లబెల్లి(వరంగల్ జిల్లా): మండలంలో విబి జి రాంజీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వివిధ కేటగిరీలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు గత మూడు నెలలుగా వేతనాలు అందడం లేదని కావున త్వరగా వేతనాలు అందజేయాలని కోరుతూ బుధవారం తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు స్థానిక పోస్ట్ ఆఫీస్ ద్వారా వినతి పత్రం పంపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.గత మూడు నెలల నుండి వేతనాలు రాక విబి జి రాంజీ గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.అలాగే ఉద్యోగస్తులు సుదీర్ఘ కాలం పని చేయడం వల్ల అవినీతి అక్రమాలు పాల్పడే అవకాశం ఉన్నందున వెంటనే బదిలీలు చేపట్టాలని కలెక్టర్ ను వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
