అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
పాల్గొన్న గడ్డం ప్రసాద్ కుమార్ , మునిసిపల్ చైర్మన్ గడ్డం అనన్య గారు
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్,వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య, పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజీవ్ గృహకల్పలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయానికి చేరుకుని అక్కడ కూడా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఆలయ అర్చకులు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, గడ్డం అనన్యలకు వేద ఆశీర్వచనం అందించి శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.రాష్ట్ర ప్రజలు, వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా వారు స్వామివారిని ప్రార్థించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు గూడెం రాములు యాదవ్ , ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Views: 13
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
