గద్దె రాగడి ఇంట్లో దొంగతనం

గద్దె రాగడి ఇంట్లో దొంగతనం

మందమర్రి, (మంచిర్యాల) : రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దె రాగడి ప్రాంతంలోని జీఎంఆర్ టౌన్ షిప్ లోని బొమ్మ మొగిలి ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. హైదరాబాద్ వెళ్ళి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి దొంగతనం చేసినట్లుగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. టీవీ,కొంత నగదును దొంగలు అపహరించినట్లుగా చెప్తున్నారు. కాగా రెండు రోజుల పాటు దొంగలు రిక్కి నిర్వహించి దొంగతనం చేశారని తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఫింగర్ ప్రింట్స్ ప్రత్యేక టీమ్ సహాయంతో తగిన ఆధారాలు సేకరించారు. అలాగే ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సహాయంతో దొంగతనం తీరును ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జాడి శ్రీధర్ పేర్కొన్నారు.
Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం
హైదరాబాద్‌: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
కోట మైసమ్మ ఆలయంలో బహిరంగ వేలం
సింగరేణిలో మెగా వృక్షారోపణ కార్యక్రమం
‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం
ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత
ఆనెగుంట సర్పంచ్‌కు డీపీఓ షోకాజ్ నోటీసులు
ఏకలవ్య పాఠశాలలో ఆరోగ్య శిబిరం