ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
- సాయి నామస్మరణతో మారుమెగిన సాయిబాబా దేవాలయం.
- పాల్గొన్న తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి.
తాండూరు (వికారాబాద్ జిల్లా) పట్టణంలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బుధవారం గురు పౌర్ణమి పురస్కరించుకుని కొకాట్ మార్గంలోని శ్రీ సాయిబాబా దేవాలయం లొ శ్రీ సాయి బాబా ముందు విరాట్ కు ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు మరియు ఘనమైన పుష్పార్చన చేశారు.ఈ మహోత్సవంలో తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సాయిబాబా వారికి వివిధ రకాల సుగంధ పుష్పాలతో భక్తిశ్రద్ధలతో అర్చన చేశారు. అనంతరం వేద పండితులు చైర్‌పర్సన్ కు ఆశీర్వచనం అందించి, స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. "సాయినాథుని దివ్య ఆశీస్సులు మన తాండూర్ పట్టణ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు" తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని సాయిబాబా వారి కృపకు పాత్రులయ్యారు.

Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
